
ప్రజాశక్తి-రైల్వేకోడూరు (అన్నమయ్యజిల్లా) : రైల్వే కోడూరులోని జామియా మసీదు నూతన అధ్యక్షులుగా రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ హాజీ అబ్దుల్ ముజీబ్‌ను నియమించినట్లు మత పెద్దలు ఆదివారం తెలిపారు. జామియా మసీదులో మత పెద్దలు సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారని అందులో భాగంగా అధ్యక్షులుగా అబ్దుల్ ముజీబ్, కార్యదర్శిగా హాజీ సాదిక్ భాషా, ఉపాధ్యక్షులుగా తయుబ్, జాయింట్ సెక్రటరీగా నజీర్, కోశాధికారిగా అబ్దుల్ రవూఫ్‌ను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ముజీబ్ మాట్లాడుతూ.. నిర్మాణంలో ఉన్న నూతన జామియా మసీదు పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని,అందరి సహకారం అవసరమని అన్నారు.