Jun 18,2023 12:59

ఢిల్లీ : సెప్టెంబర్‌ 14 వరకు గడువు పొడిగిస్తూ యూఐడీఏఐ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ గడువు ముగిసిన అనంతరం విధిగా డబ్బులు చెల్లించి, అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. 'మై ఆధార్‌' పోర్టల్‌ ద్వారా మొబైల్‌ ఫోన్లలో కూడా నవీకరించుకునే అవకాశాన్ని కల్పించింది. పేరు, పుట్టిన తేదీ, చిరునామాతో పాటు తాజాగా దిగిన ఫొటోను కూడా అప్‌లోడ్‌ చేసుకునే వీలుంది. ఆధార్‌ ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడం కోసం మార్చి 15 నుంచి మొదటిసారిగా అవకాశం కల్పించింది. యూఐడీఏఐ ఇచ్చిన నాలుగు నెలల గడువు ఈనెల 14తో ముగిసింది. దీంతో ఈ గడువు మరో మారు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.