
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఎపిఇఆర్‌సి) ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మార్చారు. ఈ మేరకు విద్యుత్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఎపిఇఆర్‌సి ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.