ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్‌కు ప్రాతినిధ్యం కల్పించాలి : యూనియన్ నేతలు
ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : జర్నలిస్టులకు ప్రభుత్వం జారీ చేసే అక్రిడిటేషన్ కార్డుల ఎంపిక కమిటీలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని ఆ యూనియన్ ఆదోని అధ్యక్ష, కార్యదర్శి బసవ రాజు, మునెప్ప కోరారు. యూనియన్ నాయకులు ఉరుకుందప్ప, ఎంకే ఆంజనేయులు, షంషీర్ ఖాన్, మల్లికార్జున, రమేష్ రెడ్డి లతో కలిసి సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గతంలోని కమిటీలో యూనియన్ తరపున సభ్యులకు ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొనకపోవడం సమంజసం కాదన్నారు. వేలాదిమంది జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారన్నారు. క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యూనియన్‌కు కార్యవర్గం ఉందన్నారు. ఇలాంటి యూనియన్ కు ప్రాతినిధ్యం కల్పించకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వినతి పత్రం పంపుతామని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ హామీ ఇచ్చారు. నాయకులు సుధాకర్, వాల్మీకి సుధాకర్, రఘునాథ్ రెడ్డి ఉన్నారు










