Jul 15,2023 13:35

ప్రజాశక్తి-గుత్తి (అనంతపురం) : మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ... శనివారం సిఐటియు అనుబంధ సంస్థ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ జి.శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ గుత్తి అధ్యక్ష, కార్యదర్శులు కె.సూర్యనారాయణ, ఎన్‌.రామాంజనేయులు మాట్లాడుతూ ... మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్మికులకు పనిముట్లు పంపిణీ చేయాలని కోరారు. పిఎఫ్‌, ఈఎస్‌ఐ చనిపోయిన కార్మికులకు డెత్‌ బెనిఫిట్‌ ఇవ్వాలన్నారు. జనాభాకు సరిపడే కార్మికుల సంఖ్యను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ గుత్తి ఉపాధ్యక్షుడు కె.మహేష్‌, నాయకులు చంద్ర, తదితరులు పాల్గొన్నారు.