ప్రజాశక్తి-ఇచ్ఛాపురం(శ్రీకాకుళం) : ఇచ్ఛాపురంలోని పురుషోత్తమపురం చెక్ పోస్ట్‌లో ఎసిబి అధికారులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎసిబి డిఎస్ పి.రమణమూర్తి అధ్వర్యంలో సీఐ భాస్కర్‌రావు ఇతర సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు అక్రమంగా డ్రైవర్లు వద్ద నుండి వసూలు చేసిన నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రమణ మూర్తి మాట్లాడుతూ.. వాహన డ్రైవర్లు నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సుమారు 25 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాదాపూ ఏడేళ్లు తర్వాత ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఎత్తున తర్వాత ఎసిబి అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టడం గమనార్హం. ఈ దాడుల్లో ఎసిబి అధికారులు చిన్నం నాయడు, సత్యారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.










