ప్రజాశక్తి-గండేపల్లి (కాకినాడ) : మండల కేంద్రమైన గండేపల్లి గ్రామ శివారులో కామచెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల మేరకు గోకవరం గ్రామానికి చెందిన చింతల అనిల్ కుమార్ (24) గండేపల్లి గ్రామంలో తాపీ పని చేసేందుకు వచ్చి నిన్న సాయంత్రం మలవిసర్జనకు బయటికి వెళ్లాడు. అనిల్ కుమార్ తిరిగి రాకపోవడంతో వెతకగా చెరువు వద్ద మోటార్ సైకిల్ ఉండడంతో చెరువులో ఈతగాళ్లతో గాలించారు. అందులో అనిల్ కుమార్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురంకు తరలించినట్లు ఎస్సై వై గణేష్ కుమార్ తెలిపారు.










