గుంటూరు : గుంటూరులో నిర్వహించిన ఎస్సై దేహదారుఢ్య పరీక్షలో అపశ్రుతి చోటుచేసుకుంది. పరుగు పోటీలో పరుగెత్తుతూ మోహన్ అనే ఎస్సై అభ్యర్థి సొమ్మసిల్లి పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువకుడిని హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. మోహన్‌ను పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు.










