Sep 06,2023 16:29

ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : టిటిడి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారిగా పాలకొల్లు వచ్చిన మేకా శేషుబాబుకు పాలకొల్లులో ఘనస్వాగతం లభించింది. పూలపల్లి వై జంక్షన్‌ నుంచి ఆయన అనుచరులు భారీ బైక్‌ ర్యాలీని నిర్వహిచారు. దారి పొడవునా ఆయనకు ప్రజలు, వ్యాపారులు బ్రహ్మరదం పట్టారు. ఆయనతో పాటు నియోజకవర్గ వైసిపీ ఇన్‌ చార్జి గుడాల గోపి, జెడ్పిటిసి నడపన గోవిందరాజులు, కార్పోరేషన్‌ చైర్మన్‌ పెండ్ర వీరన్న, గుబ్బల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.