Apr 06,2023 15:19

ప్రజాశక్తి-వడ్డాది (అనకాపల్లి) : అనారోగ్యంతో విశాఖ కేజీహెచ్‌ డైరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పెన్షన్‌ లబ్ధిదారులకి వడ్డాది వాలంటీర ప్రశాంత్‌, బంగారు మెట్ట వలంటైర్‌ కె.మంజూష విశాఖ వెళ్లి పెన్షన్‌ నగదు అందజేశారు. వివరాల ప్రకారం.. వడ్డాదికి చెందిన కూర్మాసుల మోహనరావుకి బంగారు మెట్ట గ్రామానికి చెందిన శరగడం జగన్నాధం ఇటీవల హాస్పటల్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. మరో వారం రోజులపాటు అక్కడే చికిత్స తీసుకోవలసి ఉంది. ఈనేపథ్యంలో గ్రామ వాలంటీర్‌ ప్రశాంత్‌, మంజూష గురువారం ఉదయం తన సొంత ఖర్చులతో విశాఖ వెళ్లి తంబ్‌ వేయించి పెన్షన్‌ నగదు అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులు వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రశాంత్‌ను, మంజూషను సచివాలయ కన్వీనర్‌ యనమల వాసు, సచివాలయ సిబ్బంది అభినందించారు.