Sep 10,2023 09:51
  • నేడు పాకిస్తాన్‌తో సూపర్‌4 కీలక పోరు
  • పొంచివున్న వర్షం ముప్పు ?
  • మధ్యాహ్నం 3.00గం||ల నుంచి

కొలంబో: ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీ సూపర్‌4లో భారతజట్టు కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా.. పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇరుజట్ల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా తుడుచుకుపోవడంతో ఇరుదేశాల క్రీడాభిమానులు ఈ మ్యాచ్‌ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక టీమిండియా విషయానికొస్తే.. లీగ్‌ దశలో పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారతజట్టు 266పరుగులకే ఆలౌటైంది. ఇషాన్‌, హార్దిక్‌ పాండ్యా మినహా.. మిగతా బ్యాటర్స్‌ నిరాశపరిచారు. ఆ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్‌ సజావుగా సాగకపోయినా.. పాక్‌ పేసర్లు భారత్‌పై పైచేయి సాధించారు. ఈ క్రమంలో భారతజట్టు ఫైనల్‌కు చేరాలంటే తొలి అడ్డంకి అయిన పాకిస్తాన్‌పై గెలుపు తప్పనిసరి. కేఎల్‌ రాహుల్‌, జస్ప్రీత్‌ బుమ్రా కూడా జట్టుకు అందుబాటులోకి రావడంతో ఓపెనింగ్‌ జోడీగా ఎవరెవరు బరిలోకి దిగుతారో మరికొంత సేపట్లో తేలిపోనుంది.
ఈ క్రమంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారత్‌పై కచ్చితంగా విజయం సాధిస్తామని థీమా వ్యక్తం చేశాడు. ''మేము గత రెండు నెలల నుంచి శ్రీలంకలో క్రికెట్‌ ఆడుతున్నాము. మా జట్లులో చాలా మంది ఆటగాళ్లు లంక ప్రిమియర్‌ లీగ్‌లో ఆడారు. అలాగే టోర్నీ ప్రారంభానికి ముందు ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్‌ కూడా ఆడాం. కాబట్టి లంక పరిస్ధితులను బాగా ఆర్ధం చేసుకున్నామన్నాడు. ఆ అనుభవంతో భారత జట్టుపై పైచేయి సాధిస్తామని, లీగ్‌ దశ మ్యాచ్‌లోనూ భారత్‌పై పై చేయి సాధించామని పేర్కొన్నాడు. అలాగే పాక్‌ పేస్‌ త్రయం షహీన్‌ షా అఫ్రిది, హారీస్‌ రవూఫ్‌, నసీం షాపై బాబర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కూ వర్షం ముప్పు?

భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగే ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగే మ్యాచ్‌ అవకాశాలు లేవని అక్కడ వాతావరణ శాఖ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొలంబోలో 90 శాతం వర్షం కురిసే అవకాశమున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా సాయంత్రం వేళలో వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉందని, రిజర్వ్‌ డే అయిన మరుసటి రోజు కూడా ఇదే పరిస్థితి ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని తెలిపింది. ఇక భారత్‌ాపాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
జట్లు(అంచనా)...
భారత్‌ :
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌/కేఎల్‌ రాహుల్‌, కోహ్లి, శ్రేయస్‌, ఇషాన్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌, జడేజా, బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌, శార్దూల్‌.
పాకిస్తాన్‌ : బాబర్‌(కెప్టెన్‌), రిజ్వాన్‌(వికెట్‌ కీపర్‌), ఇమామ్‌ాఉల్‌ాహక్‌, అఘా సల్మాన్‌, ఇప్తికార్‌ అహ్మద్‌, షాదాబ్‌ ఖాన్‌, షాహిన్‌ షా, నసీమ్‌ షా, రవూఫ్‌, నవాజ్‌, అష్రాఫ్‌/హర్రీస్‌.