Jun 04,2023 11:21

ప్రజాశక్తి- బుచ్చయ్యపేట (అనకాపల్లి) : రాజాంకు చెందిన క్రీడాకారుడు పరవాడ అప్పలనాయుడు అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందాడు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. వాలీబాల్‌, రన్నింగ్‌, క్రికెట్‌, కోకో, లాంగ్‌జంప్‌ క్రీడలలో అప్పలనాయుడుకి మంచి ప్రావీణ్యం ఉంది. డిఫెన్స్‌ ఉద్యోగాలకు ప్రయత్నించే యువతకు రన్నింగ్‌, లాంగ్‌జంప్‌లలో అప్పలనాయుడు కోచ్‌గా శిక్షణ ఇచ్చేవాడు. క్రీడల్లో పలు జాతీయ అవార్డులను సైతం సాధించాడు. అప్పలనాయుడు అంతిమయాత్రకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. రాజాంలో నిర్వహించిన అంతిమయాత్రకు ఎర్రవాయి గ్రామాల నుండి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. అప్పలనాయుడు చిత్రపటంతో అమర్‌ రహే అప్పలనాయుడు అంటూ దారి పొడవునా నినాదాలు చేశారు. చిన్న వయసులో అప్పలనాయుడు మఅతి చెందడంతో పలువురు యువకులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మరిసా నాని పాల్గొన్నారు.