Apr 29,2023 11:38

ప్రజాశక్తి - బుచ్చయ్యపేట (అనకాపల్లి) : ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తూ అక్రమంగా 110 మద్యం సీసాలను తరలిస్తున్న సేల్స్‌ మాన్‌ ను బుచ్చయ్యపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. శనివారం స్థానిక ఎస్సై కుమారస్వామి అందించిన వివరాల మేరకు ... మండలంలో ఉన్న వడ్డాది ప్రభుత్వ మద్యం దుకాణంలో వడ్డాది గ్రామానికి చెందిన కొల్లిమల్ల మహేష్‌ పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి మద్యం సీసాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు నాలుగు రోడ్ల కూడలిలో అదనపు ఎస్సై సింహాచలం నాయుడు తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా సేల్స్‌ మాన్‌ మహేష్‌ స్కూటీపై మద్యం సీసాలను గుర్తించారు. వాటిని తరలిస్తున్నాడన్న విషయం తెలిసి అదుపులోనికి తీసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సేల్స్‌ మెన్‌ మహేష్‌ ను రిమాండ్‌ కు తరలించినట్లు ఎస్సై కుమారస్వామి తెలిపారు.