మైలవరం (ఎన్‌టిఆర్) : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలో మట్టి మాఫియా రెచ్చిపోతుందని స్థానికులు వాపోతున్నారు వ్యవసాయ భూములకు మట్టితోలడానికి మట్టి మాఫియా డాన్ పర్మిషన్లు తెచ్చుకున్నారనీ, వేల టన్నుల్లో ఇటుక బట్టీలకు మాఫియా మట్టిని తరలిస్తుందని పలువురు ఆరోపించారు. మామూళ్ల మత్తులో రెడ్డిగూడెం మండల అధికారులు జోగుతున్నారనీ, దీంతో దుమ్ము ధూళితో రెడ్డిగూడెం గ్రామ ప్రజలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజుల నుండి ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నప్పటికీ మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు.










