
న్యూఢిల్లీ : పెరుగుతున్న ధరలను నియంత్రించే పేరుతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో ఆసియా, ఆఫ్రికా దేశాలలో దాని ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి ధరలు పెరగడం అనివార్యమని, ఏ మేరకు పెరుగుతాయో చూడాల్సి ఉంటుందని థారు బియ్యం ఎగుమతిదారుల సంఘం గౌరవాధ్యక్షులు చూకియత్ ఆపస్‌వాంగ్సే చెప్పారు. ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలకు బియ్యం ప్రధానమైన ఆహారమని, సంబంధిత నిపుణులు పేర్కొన్నారు. భారత్ విధించిన ఆంక్షలు చైనా, మలేసియా, ఫిలిప్పీన్స్, ఇండొనేషియా, ఆఫ్రికా దేశాలకు బియ్యం రవాణాపై ప్రభావం చూపుతాయి. ఆయా దేశాలు దౌత్య మార్గాల ద్వారా బియ్యం కొనుగోలుకు చేసుకునే ఏర్పాట్ల పైన ఆధారపడి ఉంటుంది.