Feb 13,2023 07:56

దీపం కత్తి పట్టుకుని
చీకటిపై యుద్ధం ప్రకటిస్తుంది 'వొత్తి'
తనువు చాలిస్తున్న
చలించని కాంతి నిబ్బరం వొత్తిది
అదృశ్య దారుల్లో వాయు వాగుపై
పరిమళాల్ని చిందేది 'పూలు'
నలిగిపోతున్న కొసల్లోనూ
రెప్పవాల్చని మెలుకువ స్వప్నం పూలది

పచ్చని పొద్దుల తాండవంతో
శూన్యం అందలంపై
శ్వాస దీపాల్ని మలిగిస్తుంది 'చెట్టు'
ఒట్టి బక్కచిక్కిన బర్రల వీపుమీదైనా
ఊపిరి పోసుకునే కలల వసంతం చెట్టుది
పిడచకట్టిన మట్టి పెదవుల
సాలు దండెంపై వాలిన పచ్చల పిట్ట 'కవిత్వం'
వడిలిపోతున్న క్షణాల్ని వెంటేసుకొని
ఒక రెక్కతో నైనా శ్వాసించి వెలుగు వానై కురిసే
నమ్మకమైన గురి 'కవిది'!

- ఈ.రాఘవేంద్ర
94940 74022