ఢిల్లీ: కంపెనీ చరిత్రలోనే ఈ ఆర్థిక సంవత్సరం అత్యధిక కొత్త బైక్‌లను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నామని హీరోమోటోకార్ప్ సీఈఓ నిరంజన్ గుప్తా తెలిపారు. తద్వారా ప్రీమియం బైక్ సెగ్మెంట్‌లో పట్టు సాధిస్తామని తెలిపారు. హీరోమోటోకార్ప్- హార్లీ డేవిడ్‌సన్ భాగస్వామ్యంలో తొలి బైక్‌ను కూడా ఈ ఏడాదే మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం బడ్జెట్ బైక్ సెగ్మెంట్ (100- 110సీసీ)లో హీరోమోటోకార్ప్‌కు పెద్దవాటా ఉంది. 125 సీసీ విభాగంలోనూ మార్కెట్ వాటా పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 160 సీసీ సెగ్మెంట్‌పైనా గురి పెట్టింది. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రతి త్రైమాసికంలో కొత్త బైక్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తామని గుప్తా తెలిపారు. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్‌లో చాలా బైక్‌లను లాంఛ్ చేస్తామన్నారు. 150 సీసీ నుంచి 450 సీసీ మధ్యశ్రేణిపై ప్రధానంగా దఅష్టి సారించినట్లు వెల్లడించారు. మార్కెట్ వాటా, మార్జిన్లపరంగా ఈ ఏడాది గణనీయ వఅద్ధిని నమోదు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
విడా బ్రాండ్‌తో హీరోమోటోకార్ప్ ఈవీ సెగ్మెంట్‌లోకీ ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 100 నగరాలకు తమ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను విస్తరించాలని నిర్ణయించింది. ఈ విషయంలో హీరోకు ఉన్న బలమైన నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటామని గుప్తా తాజాగా వెల్లడించారు.










