ఆకాశంలో హరివిల్లు
చాలా కాలానికి ...
ఎండయ్యతో కలసి
వానమ్మ వచ్చింది...
ఊరంతా నీరెండ వాన..!
మిన్ను నుంచి కురిసేను
సన్న సన్నటి వెన్నెల సోన
బడి ఈడు పిల్లలంతా వానలో
తడిసి వీధుల్లో యమగోల..
విను వీథిలో విరిసే హరివిల్లు..
చిన్నారులలో కురిసే చిత్త జల్లు !
- జి.సూర్యనారాయణ, దివిసీమ.










