మహారాష్ట్ర : ఓ కుటుంబం లేకలేక ఆడపిల్ల పుట్టిందని ఆ పాపను ఏనుగుపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకువెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్‌గావ్‌లో జరిగింది. గ్రామానికి చెందిన గిరీశ్ పాటిల్‌కు ఐదు నెలల క్రితం పాప పుట్టింది. ఆ వంశంలో అమ్మాయి పుట్టడం 35 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. పాపకు 'ఐరా' అని పేరు పెట్టారు. చిన్నారిని నిన్న ఇంటికి తీసుకురాగా దానిని ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతిగా మార్చుకున్నారు. ఐరాను ఏనుగుపై ఊరేగిస్తూ డబ్బు వాయిద్యాల మధ్య గిరీశ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ వేడుకను తిలకించేందుకు ఊరు ఊరంతా వచ్చింది.










