ముంబయి : ఐడిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఐడిఎఫ్‌సి క్రిసిల్ ఐబిఎక్స్ గిల్డ్ -2032 ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇది ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్ అని పేర్కొంది. ఈ ఎన్‌ఎఫ్‌ఒను ఫిబ్రవరి 6న తెరిచి.. 14న మూసివేయనున్నట్లు వెల్లడించింది. పెట్టుబడులను లైసెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లతో పాటుగా నేరుగా తమ సంస్థ వెబ్‌సైట్ ద్వారా పెట్టవచ్చని తెలిపింది.










