హైదరాబాద్ : ఎలక్ట్రిక్ స్కూటర్ల డిజైన్, తయారీదారు అయినా క్వాంటమ్ ఎనర్జీ కొత్త వేరియంట్లను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. వాణిజ్య డెలివరీలకు వీలుగా 'క్వాంటమ్ బిజినెస్' పేరుతో వీటిని విడుదల చేసింది. మూడేళ్ల పాటు లేదా 90వేల కిలోమీటర్ల వరకు వారంటీని అందిస్తున్నట్లు తెలిపింది. సింగిల్ చార్జింగ్‌తో 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి వీలుందని తెలిపింది. వీటి ధరలు రూ.99,000 నుంచి ప్రారంభం అవుతాయని తెలిపింది.










