ప్రజాశక్తి- సంత బొమ్మాళి(శ్రీకాకుళం) : సంత బొమ్మాళి మండలం మేఘ వరం పంచాయతీ పరిధిలోని సముద్రతీరానికి భారీ సోరచేప గురువారం కొట్టుకు వచ్చింది. మూడు టన్నుల వరకు బరువు ఉండే ఈ చేప చనిపోయి తీరానికి కొట్టుకు వచ్చి ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. ఈ చేపను చూడటానికి ప్రజలు పోటెత్తారు.










