Oct 10,2023 14:57

ధర్మశాల :వన్డే ప్రపంచకప్‌-2023లో ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు 9 వికెట్ల నష్టానికి ఏకంగా 364 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌(107 బంతుల్లో 140) విధ్వసకర శతకంతో విరుచుకుపడ్డాడు. అతడితో పాటు జో రూట్‌(82), జానీ బెయిర్‌ స్టో(52) హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. ఓపెనర్లు మలాన్‌, బెయిర్‌ స్టో తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరిలో హ్యారీ బ్రూక్‌ 20, జోస్‌ బట్లర్‌ 20, సామ్‌ కర్రన్‌ 11, క్రిస్‌ వోక్స్‌ 14, ఆదిల్‌ రషీద్‌ 11, మార్క్‌ వుడ్‌ 6, రీస్‌ టాప్లే 1, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ 0 నిరాశపరచడంతో ఇంగ్లండ్‌ 400 పరుగుల మార్క్‌ను చేరుకోలేకపోయింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో మెహదీ హసన్‌ 4 వికెట్లు పడగొట్టగా.. షోర్‌ఫుల్‌ ఇస్లాం మూడు, టాస్కిన్‌ అహ్మద్‌, షకీబ్‌ తలా వికెట్‌ సాధించారు.