
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ (101) సెంచరీతో చెలరేగాడు. తన బర్త్ డే రోజు సెంచరీ సాధించడంతో అభిమానులు చాలా ఎంజారు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (40), శుభ్ మాన్ గిల్ (23) పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన విరాట్ కోహ్లీ 121 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ-అయ్యర్ మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది. అయ్యర్ 87 బంతుల్లో 77 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. కేఎల్ రాహుల్ (8), సూర్యకుమార్ యాదవ్ (22), జడేజా (29) పరుగులు చేశారు.
ఇక సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జన్ సన్ అత్యధికంగా పరుగులు ఇచ్చాడు. 9.4 ఓవర్లు వేసి 94 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక ఆ తర్వాత లుంగి ఎంగిడి, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, షంసీ తలో వికెట్ తీశారు. మరోవైపు భారత్-దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. 7 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 7 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.