Jul 27,2023 18:46

విజయవాడ: ఇంద్రకీలాద్రి కొండపై నుంచి గురువారం మధ్యాహ్నం భారీ కొండరాయి జారిపడింది. దుర్గగుడి ఫ్లైఓవర్‌ కింద భాగంలోని రహదారిపై భారీ కొండ రాయి పడిన సమయంలో అటువైపు వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆ ప్రదేశంలో రహదారి స్వల్పంగా దెబ్బతింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. రహదారిపై పడిన కొండరాయిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.