Jul 16,2023 15:11

వాషింగ్టన్‌: అమెరికాలోని అలస్కా సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఈ క్రమంలోనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అలస్కాకు సమీపంలో 9.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అలస్కా ద్వీపకల్పం, అలూటియన్‌ దీవులు, కుక్‌ ఇన్‌లెట్‌ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్టు అలస్కా భూకంప కేంద్రం తెలిపింది. అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియలేదు.1964 మార్చిలో అలస్కాలో 9.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు సంభవించిన భూకంపాల్లో అదే అత్యంత తీవ్రమైనదిగా చెబుతుంటారు. ఆనాటి భూకంపం, సునామీ సఅష్టించిన విలయానికి 250మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.