Sep 09,2023 22:25

పీలే రికార్డును బ్రేక్‌ చేసిన నెరుమార్‌
ఫిఫాా2026 అర్హత టోర్నీ
బ్రస్సిలియా(బ్రెజిల్‌): ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో బ్రెజిల్‌ స్టార్‌ ఆటగాడు నెరుమర్‌ జూనియర్‌ అరుదైన ఘనత సాధించాడు. బోలీవియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ జట్టు 5ా1గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ స్టార్‌ ఆటగాడు నెరుమార్‌ రెండు గోల్స్‌ కొట్టి ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే రికార్డు బ్రేక్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో నెరుమర్‌ 61వ, 93వ నిమిషంలో బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపాడు. దాంతో, అతడి గోల్స్‌ 79కు చేరింది. ఈ రెండు గోల్స్‌తో బ్రెజిల్‌ తరఫున 77గోల్స్‌ కొట్టిన పీలే రికార్డును నెరుమర్‌ బద్దలు కొట్టాడు. తర్వాత జరిగే రెండో రౌండ్‌లో బ్రెజిల్‌ జట్టు పెరూతో తలపడనుంది. నెరుమర్‌ ఇటీవల సౌదీ అరేబియాకు చెందిన అల్‌ హిలాల్‌ క్లబ్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.