ఇంటర్నెట్ డెస్క్ : పండ్లు, కూరగాయల్ని అవసరాలరీత్యా ఎక్కువ ధర పెట్టి మరీ కొంటాం. అయితే అంతరేటు పెట్టి కొనుకున్నా.. అవి కొన్న ఒకట్రెండు రోజులకే చెడిపోతుంటాయి. వాటిని చూసి మనం అయ్యో పాడైపోయాయే.. చూసే తెచ్చుకున్నా కుళ్పిపోయాయే అంటూ బాధపడిపోతాం. ఇది ఏ ఒక్కరిదో.. ఇద్దరిదో సమస్య కాదు.. యావత్ ప్రపంచవ్యాప్త సమస్యగానే చెప్పుకోవాలి. మరి ఈ సమస్య తీరాలంటే కచ్చితంగా ఆహారపదార్థాలు ఎప్పటిలోగా చెడిపోతాయో కనిపెట్టే పరికారం ఉంటే బాగుంటుందనుకుంటాం. సరిగ్గా ఇలాంటి ఆలోచనలతోనే బ్రిటన్కు చెందిన నార్తంబ్రియా యూనివర్సిటీ విద్యార్థి హారియట్ ఆల్మండ్ ఓ గాడ్జెట్ని తయారుచేశాడు. దాని పేరు 'స్నూట్'. ఈ పరికరంతో అతను కృత్రిమ నాసికను కనిపెట్టాడు. దీంతో కూరగాయలు, పండ్లు, పాలు, వెన్న, పెరుగు వంటి పదార్థాలు వాయువుల ద్వారా ఎప్పటిలోగా చెడిపోతాయో కనిపెట్టొచ్చట. అలాగే ఈ పరికరంలో వంపు తిరిగిన చోట మూతిలా తెరుచుకున్న భాగం.. పదార్థాల వాసనను గమనించి.. ఆ పదార్థాలతో అప్పటికప్పుడు తయారుచేసుకోగల రెసిపీలను కూడా వివరంగా ముద్రిస్తుంది కూడా. అయితే ఆల్మంట్ తయారుచేసిన ఈ పరికరం ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఆటవిడుపుగా చేసిన ఈ పరికరం ద్వారా ఎన్ని లాభాలున్నాయో కదా.! త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయట.










