Sep 28,2023 21:10

న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎండబ్ల్యు కొత్తగా బిఎండబ్ల్యు ఐఎక్స్‌1 ఎక్స్‌డ్రైవ్‌30 ఎం స్పోర్ట్‌ను విడుదల చేసింది. ఇది పూర్తి స్థాయి విద్యుత్‌ ఎస్‌యువి అని ఆ కంపెనీ తెలిపింది. ఎక్స్‌షోరూం ప్రారంభ ధరను రూ.66.90 లక్షలుగా నిర్ణయించింది. అక్టోబర్‌ నుంచి వీటి డెలివరీలను ప్రారంభించనున్నట్లు బిఎండబ్ల్యు గ్రూపు ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పహ్వ తెలిపారు. ఇకపై తమ వినియోగదారులు పెట్రోల్‌, డీజిల్‌, విద్యుత్‌ వాహనాల్లో దేనినైనా ఎంచుకోవచ్చన్నారు. ఐఎక్స్‌1 కేవలం 5.6 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకోగలదన్నారు.