Aug 02,2023 10:58

హబ్సిగూడ (హైదరాబాద్‌) : హబ్సిగూడలోని ఓ కాంప్లెక్స్‌లో 2, 3వ అంతస్తుల్లో ఉన్న ఓ వస్త్ర దుకాణం, రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా సమీపంలోని పెట్రోల్‌ బంకును పోలీసులు మూసివేయించారు. అగ్నిప్రమాదం జరిగిన దుకాణాల అద్దాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. మంటలు అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఇంకా దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికుల్లో ఆందోళన ఏర్పడింది. అగ్నిప్రమాదం వల్ల ఉప్పల్‌-హబ్సిగూడ మార్గంలో ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేస్తున్నారు.