హాయ్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం మా పాఠశాల్లో వార్షికోత్సవం జరుపుకుంటాం. అయితే వారం రోజుల నుంచే స్కూల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆటల పోటీలు నిర్వహిస్తారు. అందరూ సాంస్క ృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతారు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ముందు రోజు పాఠశాల గదులను శుభ్రపరిచి రంగు కాగితాలతో అలంకరిస్తాం. సరస్వతి పూజ చేస్తాము. వార్షికోత్సవం రోజు జరిగే సాంస్క ృతిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొంటారు. అదే మా పాఠశాల ప్రత్యేకత. మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల సుబ్రహ్మణ్యం సార్ మంచి ఉపన్యాసం ఇస్తారు. పిల్లలు పాటలు పాడి, డాన్స్‌లు చేస్తాం. ఏక పాత్రాభినయం, నాటికలు ప్రదర్శిస్తాం. ఫ్యాన్సీ డ్రెస్ వేసి ఫ్యాషన్‌గా నడుస్తాం. భలే సందడిగా ఉంటదిలే. కొందరు కధలు చెపుతారు. మరి కొందరు పద్యాలు చెపుతారు. అభినయ గేయాలు పాడుకుంటాం. కొందరు దేశ నాయకుల వేషధారణ వేస్తారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుంటాం. చివరిగా పోటీల్లో పాల్గొన్న వారందరికీ బహుమతులు ఇస్తారు. ఆ రోజు స్కూల్లో ఓ పండగలా ఉంటుంది.
- గిరితిక,
4వ తరగతి,
పెన్నలపాడు ప్రాథమిక పాఠశాల,
తొట్టంబేడు మండలం,
తిరుపతి జిల్లా.










