Jul 19,2023 07:33

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మిర్చి ధరల తగ్గుదల కొనసాగుతోంది. 15 రోజుల క్రితం వరకు మేలురకాలు తేజ, బాడిగ నాన్‌ ఎసి రకాలు కనిష్టంగా రూ.18 వేలు, గరిష్టంగా రూ.33 వేల వరకు పలికాయి. మంగళవారం కనిష్ట ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.26 వేలు పలికింది. కోల్డ్‌ స్టోరేజీలోని తేజ, బాడిగ ధరలు కనిష్టంగా రూ.15 వేలు, గరిష్టంగా రూ.25,500 ధర పలికాయి. ఎసి.కామన్‌ వెరయిటీలు సగటు ధర క్వింటాలు కనిష్ట ధర రూ.11 వేలు, గరిష్ట ధర రూ.22 వేలు పలికింది. నాన్‌ ఎసి కామన్‌ వెరయిటీలు కనిష్టంగా రూ.10 వేలు, గరిష్టంగా రూ.23 వేలు వచ్చింది. ఎక్కువ సరుకు కనిష్ట ధరలకే కొనుగోలు చేస్తున్నారు. ధరల తగ్గుదలతో రైతులు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారని కమీషన్‌ ఏజెంట్లు తెలిపారు. గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం 34,482 టిక్కిలు వచ్చాయి. పాత నిల్వలతో కలిపి 33,963 టిక్కిలు అమ్ముడుపోయాయి. పాత నిల్వలతో కలిపి ఇంకా 11,803 టిక్కిలు నిల్వ ఉన్నాయి.