Oct 04,2023 15:27
  •  రైతు, కౌలు రైతుల సంఘాల డిమాండ్

ప్రజాశక్తి-వీరులపాడు : మండలం చౌటపల్లి గ్రామంలో బొబ్బర తెగులు సోకి దెబ్బతిన్న మిర్చి పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘం నాయకుల బృందం పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ దెబ్బతిన్న మిర్చి చేలను శాస్త్రవేత్తలు తక్షణమే పరిశీలించాలని,పంట నష్టపోయిన మిర్చి రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరులపాడు మండలంలో ఈ సంవత్సరం సుమారు 2వేలు ఎకరాలలో రైతులు మిర్చి పంటను సాగు చేశారు. మిర్చి మొక్క వేసిన 20రోజుల నుంచి మొక్కల్లో పెరుగుదల లేక ఎర్రబడిపోయాయి. పంటను రక్షించుకునేందుకు రైతులు వివిధ రకాల మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోయింది. దీనితో కొందరు రైతులు మిర్చి తోటలను పీకివేసి మరలా కొత్త మొక్కలు వేస్తున్నారు. కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్క రైతు ఎకరాకు 80వేల నుంచి లక్షరూపాయల వరకు పెట్టుబడి పెట్టిఉన్నారు. ప్రభుత్వం తక్షణం శాస్త్రవేత్తలను పంపించి మిర్చి పంటను పరిశీలింప చేసి పంటల భీమా వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కోడూరు పిచ్చేశ్వరావు, కౌలు రైతుల సంఘం మండలం కార్యదర్శి చాట్ల రవి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్, రైతులు గురజాల శ్రీనివాసరావు, గురజాల వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.