న్యూఢిల్లీ : బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. శనివారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారంపై రూ.220 తగ్గి రూ.60,820గా పలికినట్లు గోల్డ్ రిటర్న్స్ వెబ్‌సైట్ తెలిపింది. కిలో వెండి ధర యథాతథంగా రూ.76,200గా నమోదయ్యింది. 22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారంపై రూ.200 తగ్గి రూ.55,750గా పలికింది.










