గాజువాక (విశాఖ) : రోడ్డు పక్కన వ్యక్తి మృతదేహం పడి ఉన్న ఘటన ఆదివారం విశాఖ గాజువాకలో చోటుచేసుకుంది. గాజువాక వుడా కాలనీలో రోడ్డు పక్కన వ్యక్తి మృతదేహం పడి ఉంది. కొట్టి హత్య చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు మైలార అప్పారావు (40) లారీ డ్రైవర్‌గా గుర్తించారు. మృతుడి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకొని రోదించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










