Sep 25,2023 07:35

అంతరిక్ష ప్రయాణికులారా ...
అంతా శ్రద్ధగా వినండి
భారత్‌ నుంచి పల్లె వెలుగు బస్సు
జాబిల్లిని చేరబోతుంది
ఒకళ్ల నొకళ్లు తోసుకోక
మెల్లగా దిగండి
మీ మూటా ముల్లె మరిచిపోక
మీతోనే తీసుకువెళ్ళాలండి
జేబుదొంగలుంటారు సుమా!
జాగ్రత్తగా మెలగండి
ఫలహారాలు చేసినా
పరిసరాలు చూడండి
చిరుతిళ్లు, రేపర్లు
చెల్లాచెదురుగా పడవేయకండి
ముచ్చటైన చందమామ
మచ్చ పెరగనీకండి
చీకటి పడేలోగా...
అదే, అమావాస్య వచ్చేలోగా..
అందరూ బస్సు వద్దకు చేరండి
సెల్ఫీల తలపులోన
దారి మర్చిపోకండి
మార్స్‌ వైపు పోకండి
బస్సు వద్దకు చేరండి!
 

- డా. డి.వి.జి.శంకర రావు,
మాజీ ఎంపీ,
94408 36931