ప్రజాశక్తి-హిందుపురం(సత్యసాయిజిల్లా) : చెడు అలవాట్లకు బానిసలైన వ్యక్తులు మార్పు ద్వారా మెరుగైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ, అదనపు మెజిస్ట్రేట్ రాజ్యలక్ష్మిలు పేర్కొన్నారు మంగళవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో వారు మాట్లాడారు. చెడు అలవాట్లకు బానిసలు కావడం వల్ల తమ జీవితంతో పాటు కుటుంబ సభ్యులు కూడా అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగుడుకు మత్తుపదార్థాలకు బానిసలు కావద్దని సూచించారు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏ డీజే మత్తుపదార్థాలకు తాగుడుకు బానిసలైన వ్యక్తులకు పుష్పాలు అందజేసి మార్పుపై దృష్టి సారించాలని సూచించారు ఇందులో భాగంగా స్థానికుల ఫిర్యాదు మేరకు అక్రమ మద్యం విక్రయాలు విక్రయాలపై తరచూ తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఎస్సై హారూన్ భాషను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రోహిత్, వైద్యులు రాజగోపాల్, రుక్మిణమ్మ, ఏపిపి ఇందాద్, న్యాయవాదులు సుదర్శన్ నవేరా, అంజినమ్మ, లోక అదాలత్ హేమావతి తదితరులు పాల్గొన్నారు










