Jul 31,2023 21:29

న్యూఢిల్లీ : దేశంలో గడిచిన ఐదేళ్లలో దాదాపు లక్ష కంపెనీలు తమ కార్యకలాపాలను మూసివేసుకున్నాయి. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణంకాల ప్రకారం.. 2018 ఏప్రిల్‌ 1 నుంచి 2023 మార్చి 31 వరకు 96,261 కంపెనీలు స్వచ్ఛందంగా నిష్క్రమించాయి. ఆర్థికంగా సరైన మద్దతు లభించకపోవడం, వస్తు ఉత్పత్తులకు డిమాండ్‌ పడిపోవడం తదితర కారణలు. కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 248(2) ప్రకారం కంపెనీల స్వచ్ఛంద నిష్క్రమణ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం సెంటర్‌ ఫర్‌ ప్రాసెసింగ్‌ యాక్సిలరేటెడ్‌ కార్పొరేట్‌ ఎగ్జిట్‌ (సిపిఎసిఇ)ని ఏర్పాటు చేసింది.