
ప్రజాశక్తి-ఏలేశ్వరం (కాకినాడ) : కమర్షియల్ గ్యాస్ వినియోగించవలసిన రెస్టారెంట్లో అక్రమంగా వినియోగిస్తున్న తొమ్మిది డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కె.కుమార్ మాట్లాడుతూ ... ప్రత్తిపాడు మండలం రాసపల్లి అడ్డ రోడ్లో ఉన్న శివ దుర్గ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద తనిఖీలు చేశామన్నారు. ఈ తనిఖీల్లో అక్రమంగా వినియోగిస్తున్న 9 వంటగ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని సివిల్ సప్లరు అధికారులకు స్వాధీనం చేశామన్నారు. రెస్టారెంట్ యజమాని పెద్దిరెడ్డి పాపారావు పై ఈసీ చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు. గృహ వినియోగానికి సరఫరా చేసే వంటగ్యాసును ఎవరైనా వ్యాపార అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.