ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : మండలంలోని రాజవొమ్మంగి, జడ్డంగి, లాగరాయి పీహెచ్సీల పరిధిలో గురువారం 8 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆయా పీహెచ్సీల వైద్యాధికారులు తెలిపారు. దీంతో మండలంలో ఇప్పటివరకు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 27కు చేరింది. కోవిడ్ వైరస్ మండలంలో విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అశ్రద్ధ వహించకూడదని వైద్యాధికారులు లిఖిత, సేవాసుజీ, రవీంద్రలు హెచ్చరించారు.










