Sep 03,2023 10:51

 న్యాయశాఖ నోటిఫికేషన్‌
న్యూఢిల్లీ  : 
జమిలి ఎన్నికల కమిటీపై న్యాయశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను నియమించింది. కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కె సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజరు కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. మోడీ ప్రభుత్వం తొలి నుంచి ప్రచారం చేసుకుంటున్న 'ఒకే దేశం - ఒకే ఎన్నిక'పై తాజాగా కమిటీని నియమించడంతో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశం చర్చనీయాంశమవుతోంది.