Nov 30,2022 10:36

మొగదిషు : సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు హోటల్‌ను ఆధీనంలోకి తీసుకోగా, భద్రతా అధికారులు విజయవంతంగా పరిష్కరించారు. ఈ క్రమంలో 8మంది పౌరులు మరణించారని జాతీయ పోలీసు ప్రతినిధి తెలిపారు. ఆదివారం రాత్రి 8గంటల సమయంలో అల్‌ఖైదాకి చెందిన కొందరు తీవ్రవాదులు విల్లా రోజ్‌ హోటల్‌ను ముట్టడించి దాడులు ప్రారంభించారు. దాడులు ప్రారంభమైన దాదాపు 21 గంటల తర్వాత విల్లా రోజ్‌లో దాడులను అణచివేశామని పోలీసు ప్రతినిధి సాదిక్‌ దూదిషె తెలిపారు. హోటల్‌లో వున్న మరో 60మందిని కాపాడగలిగామని భద్రతా బలగాలు తెలిపాయి. భద్రతా దళాలకు చెందిన సభ్యుడు ఒకరు మరణించారు.