న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద మెమోరీ చిప్, స్మార్ట్‌ఫోన్ల తయారీదారు సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ లాభాలు భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఏడాది జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభాలు 78 శాతం క్షీణించి 1.79 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఈ దక్షిణ కొరియా టెక్ కంపెనీకి చిప్‌ల తయారీ నష్టాలు కొనసాగాయి.
- ఎఫ్‌ఇ సిరీస్‌లో కొత్త ఉత్పత్తులు
సామ్‌సంగ్ ఇండియా తన గెలాక్సీ ఎఫ్‌ఇ ఈకోసిస్టమ్ ఉత్పత్తులను విస్తరించినట్లు తెలిపింది. కొత్తగా గెలాక్సీ టాబ్ ఎస్9 ఎఫ్‌ఇ, టాబ్ ఎస్9 ఎఫ్‌ఇ ఫ్లస్‌లను ఆవిష్కరించినట్లు తెలిపింది. వీటి ధరలను వరుసగా రూ.36,999, రూ.46,999గా నిర్ణయించింది. ఇవి 128జిబి, 256జిబి మెమోరీతో లభ్యం అవుతాయని తెలిపింది. గెలాక్సీ బడ్స్ ఎఫ్‌ఇని విడుదల చేసింది. దీని పరిచయ ధరను రూ.7999గా నిర్ణయించినట్లు పేర్కొంది.