Oct 17,2023 21:10

పూణె : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బిఒఎం) మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 72 శాతం వృద్థితో రూ.920 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇదే సమయంలో బ్యాంక్‌ నిర్వహణ లాభాలు 31 శాతం పెరిగి రూ.1,920 కోట్లుగా నమోదయ్యాయి. వడ్డీయేతర ఆదాయం 33 శాతం ఎగిసి రూ.668 కోట్లకు చేరగా.. నికర వడ్డీ ఆదాయం 3.89 శాతం పెరిగింది. బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.5,796 కోట్లుగా చోటు చేసుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు 2.19 శాతానికి తగ్గగా.. నికర ఎన్‌పిఎలు 0.23 శాతానికి పరిమితమయ్యాయి.