
హాకీ ర్యాంకింగ్స్ విడుదల
లాసన్నె: అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్‌ఐహెచ్) తాజా ర్యాంకింగ్స్‌లో భారత మహిళల జట్టు సత్తా చాటింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఏకంగా 6వ ర్యాంక్‌కు ఎగబాకింది. 2023 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను చేజిక్కించుకోవడం, ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించడం ర్యాంక్ మెరుగుదలకు దోహదపడ్డాయి. జనవరి 13నుంచి రాంచీ వేదికగా జరిగే ఎఫ్‌ఐహెచ్ హాకీ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో ఒలింపిక్స్ బెర్త్‌పై కన్నేసిన భారత మహఙళల జట్టు తాజా ర్యాంకింగ్స్‌లో మెరుగవ్వడంతో మరింత ఉత్సాహంగా బరిలోకి దిగేనుంది. తాజా ర్యాంకింగ్స్‌లో నెదర్లాండ్స్ తన అగ్రస్థానానికి నిలబెట్టుకోగా.. ఆస్ట్రేలియా, అర్జెంటీనా 2, 3 స్థానాల్లో నిలిచాయి. బెల్జియం 4వ, జర్మనీ 5వ స్థానంలో ఉన్నాయి.