Apr 26,2023 20:27

హైదరాబాద్‌ : అన్ని రకాల పేపర్లు, స్టేషనరీ వస్తువుల వ్యాపారంలో ఉన్న ఐఎఫ్‌ఎల్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు 8.16 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.67 కోట్లు) ఎగుమతి ఆర్డర్లు దక్కినట్లు ఆ సంస్థ పేర్కొంది. కెన్యా కంపెనీ ప్రెరీనా హోల్డింగ్‌ లిమిటెడ్‌ నుంచి ఈ ఆర్డర్‌ను పొందినట్లు పేర్కొంది. అక్కడి పాఠశాలలకు రాత పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, బాండ్‌ పేపర్లు, కాపీ పేపర్లను సరఫరా చేయనుంది. ఎగుమతులు 2023 జూన్‌ నుంచి మార్చి 2024 నాటికి వీటి సరఫరా పూర్తి చేయనున్నామని ఐఎఫ్‌ఎల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎండి, సిఎఫ్‌ఒ డోలార్‌ షా పేర్కొన్నారు.