Oct 03,2023 20:55

న్యూఢిల్లీ : బంగారం ధరల్లో వరుసగా తగ్గుదల చోటు చేసుకుంటుంది. మంగళవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్చత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.650 తగ్గి రూ.57,550గా నమోదయ్యిందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌ వెల్లడించింది. ఇంతక్రితం సెషన్‌లో రూ.58,200 వద్ద ముగిసింది. కిలో వెండిపై రూ.1,800 పతనమై రూ.71,500 వద్ద ముగిసింది. విదేశీ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరల్లో తగ్గుదల చోటు చేసుకుంటుంది. ఒక్క ఔన్స్‌ పసిడి ధర 1.825 డాలర్లుగా, వెండి ధర 21.10 డాలర్లుగా నమోదయ్యింది. గత కొన్ని వారాలుగా అమెరికా బాండ్లలో పెట్టుబడులు పెరగడంతో బంగారంపై పెట్టుబడులు తగ్గుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మల్టీ కమోడిటీ ఎక్సేంజీలో 10 గ్రాముల బంగారం ధర 57,426కు పడిపోయింది. వచ్చే కొద్ది రోజుల్లో పసిడి ధరల్లో 10 శాతం వరకు దిద్దుబాటుకు గురైయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.