Sep 06,2022 21:04

హైదరాబాద్‌ : ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి దక్షిణ భారత దేశంలో మరో 600 కోట్ల హోటళ్లు, హోమ్‌లను జోడించనున్నట్లు ఓయో వెల్లడించింది. ఇప్పటికే ఓయో ప్లాట్‌ఫారమ్‌లోకి వచ్చిన కొత్త హోటళ్లు తమ రాబడిని రెట్టింపు చేసుకున్నాయని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. తమ టాప్‌ 10 వ్యాపార మార్కెట్లలో బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నరు, కొచ్చి, విశాఖపట్నం, పుదుచ్చేరి నగరాలున్నాయని తెలిపింది.