సాన్ సాల్వడార్: లాటిన్ అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్‌లో భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత 6.5గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. పసిఫిక్ మహాసముద్రం తీరంలోని ఎల్ ఎల్వడార్ ప్రాదేశిక జలాల్లో భూమి కంపించింది. సముద్ర గర్భంలో 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపంతో దేశ రాజధాని సాన్ సాల్విడార్‌కు సమీపంలోని సముద్ర తీర పట్టణమైన లా లిబర్టెడ్‌లో కూడా భూమి కంపించింది. భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిళ్ల లేదని, సునామీ వచ్చే అవకాశం లేదని వెల్లడించారు.










