అఫ్ఘానిస్థాన్ : అఫ్ఘానిస్థాన్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. శనివారం మధ్యాహ్నం 12:42 గంటలకు తుర్క్‌మెనిస్థాన్‌లోని అస్గాబట్ నగరానికి ఆగేయంగా 428 కిలో మీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 34 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.